మహిళలంతా తమ జుట్టు పొడవుగా, స్ట్రాంగ్‌గా ఉండాలని భావిస్తారు. కొన్ని చిట్కాలు పాటిస్తే పొడవైన, ధృఢమైన జుట్టు పొందొచ్చు. ఎప్పటికప్పుడు జుట్టుకు నూనె రాయాలి. రాసిన తర్వాత మృదువుగా కనీసం 20 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. 2-3 గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. కివి, జామ, ఆరెంజ్, బ్లాక్‌బెర్రీస్ వంటి విటమిన్-సి ఉన్న ఆహారాన్ని తినాలి. రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్, పప్పులు, గుడ్లు, చేపలు వంటి ప్రోటీన్ ఫుడ్‌ను చేర్చుకోవాలి. రాత్రిపూట కనీసం 8 నుండి 9 గంటల నిద్ర పోవాలి. ఇవి పాటిస్తే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.