అల్లుడితో డ్రగ్స్ మాన్పించేందుకు మేనమామ చేసిన ప్రయత్నం అతడి ప్రాణమే తీసింది. మేనమామను కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు మేనల్లుడు. పంజాబ్ అమృత్ సర్లో జరిగిందీ ఘటన. రయ్యా సమీపంలోని గగ్గర్బనా గ్రామానికి చెందిన యువకుడు గుర్బిందర్ సింగ్ అలియాస్ గోపీ డ్రగ్స్ కు బానిసయ్యాడు. అతడితో డ్రగ్స్ మాన్పించేందుకు కుటుంబసభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. డ్రగ్స్ కు బానిస అయిన ఆ యువకుడు.. తన మేనమామ నరైందర్ సింగ్ ను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.