భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఢాకాలో ఉదయం 11:30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా రేపటి మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది. రేపటి మ్యాచ్ లో భారత్ 2, 3 మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాబాజ్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్, కుల్దీప్ సేన్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్ ఆడే అవకాశం కనిపిస్తోంది. తొలి మ్యాచ్ లో విజయంతో బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. రెండో వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. రేపటి మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.