సుండుపల్లె మండలం గుండ్లపల్లె గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రముఖ విద్యావేత్త, రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాల సమ్మేళనంలో అంతటి సంక్లిష్టతతో కూడుకున్న ఆయన రచించిన రాజ్యాంగం ద్వారా ఐక్యత సాధించగలిగాము, స్వాతంత్రం తరువాత భారతదేశాన్ని ఐక్యం చేయడంలో రచించిన రాజ్యాంగం కీలక పాత్ర వహించిందన్నారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తికి నివాళులర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అయన వెంట సుండుపల్లె టిడిపి సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రాజు, మాజీ ఎంపీటీసీ బాబురావు నాయుడు, శివరాం నాయుడు, గ్రామ అధ్యక్షులు శేఖర్ నాయుడు, రాజగోపాల్ నాయుడు, రాజా నాయుడు, రాఘవేంద్ర, మహబూబ్ బాషా, సురేష్ నాయుడు, పురుషోత్తమ రాజు, హరి కుమార్ నాయుడు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa