డిసెంబర్ 7న విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ సభ జరగనుంది.ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ సభ జరగనుంది. కాగా, ఈ సభ ఏర్పాట్లను ఏపీ మంత్రులు బొత్స, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరి జయరాం తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు న్యాయం చేసింది సీఎం జగన్ ఒక్కరేనని వెల్లడించారు. బీసీలకు మార్కెట్ కమిటీ నుంచి రాజ్యసభ పదవులు రావడానికి జగన్ కారణమని స్పష్టం చేశారు. బీసీలకు మరింత మేలు చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, అమ్మ ఒడి పథకాలతో బీసీల జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని బొత్స అన్నారు. మరి చంద్రబాబు బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇస్త్రీ పెట్టెలు, కిరాణా బండ్లతో బీసీ సంక్షేమం అయిపోతుందా? అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa