భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఉదయం 11:30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో ఓటమిపాలైన టీమిండియాకు నేడు కఠిన పరీక్ష ఎదురుకానుంది. రెండో వన్డేలో భారత్ ఓడిపోతే సిరీస్ బంగ్లాదేశ్ కైవసం చేసుకుంటుంది. నేటి మ్యాచ్ లో స్పిన్ బౌలర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ లో రోహిత్, కోహ్లీ, ధావన్ రాణించడం టీమిండియాకు చాలా అవసరం. భారత జట్టు నేడు 2, 3 మార్పులతో బరిలోకి దిగే ఛాన్సుంది.