ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనస్తాపంతో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 07, 2022, 12:46 PM

తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే... కృష్ణా జిల్లా, తిరువూరు మండలం , మునుకుళ్ల గ్రామంలో నర్సింగ్‌ రాము(19) ఇంటర్‌ పూర్తి చేయకుండా ఖాళీగా తిరుగుతుండటంతో తండ్రి నరసింహారావు మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన రాము సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని రాత్రికి రాత్రే ఖననం చేసే ప్రయత్నం చేయటంతో సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం తహసీల్దార్‌ సురేష్‌బాబు, సీఐ బీమరాజు రెవెన్యూ సిబ్బంది సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్సై పద్మారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com