ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి సోదరుడి కుమార్తె ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Wed, Dec 07, 2022, 01:34 PM

తమిళనాడు మంత్రి, డీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ సోదరుని కుమార్తె ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంత్రి అన్న మహాలింగం కుమార్తె భారతి కాట్పాడిలోని గాంధీనగర్ లో తన భర్త రాజ్ కుమార్ తో కలిసి నివసిస్తున్నారు. సోమవారం కాట్పాడి సమీపంలోని లత్తేరి వద్ద ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని వేలూరు అడుక్కంబరై ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భారతి చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com