నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ అధీనంలో ఉన్న స్కూళ్లు కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. పలు విభాగాల్లో 317 పోస్టులు ఖాళీగా ఉండగా, ఐటీడీఏలు ఉన్న జిల్లాల్లో ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో, నాన్ ఐటీడీఏల పరిధిలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఏపీ టెట్ లో తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.