భారత్‌లో తయారైన మొట్టమొదటి టీబీ(క్షయ) టెస్ట్ కిట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్), జాతీయ టీబీ నిపుణుల కమిటీ ఈ కిట్‌ను పరీక్షించి వినియోగానికి ఆమోదం తెలిపాయి. పుణెకు చెందిన మైల్యాబ్ సంస్థ ‘పాథోడిటెక్ట్’ .. ఆర్టీ-పీసీఆర్ ఆధారిత టీబీ టెస్ట్ కిట్‌ను తయారు చేసింది. ఈ కిట్ ధర రూ.650 గా నిర్ణయించారు. ఈ కిట్ ద్వారా టీబీ పరీక్ష చేయడానికి ఎలాంటి నిపుణుల అవసరం ఉండదు.