జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల యుద్దానికి సిద్ధమంటూ తన ప్రచార రథాన్ని ఆవిష్కరించారు. దీనికి ఆయన 'వారాహి' అనే పేరును సైతం పెట్టారు. కాగా, తెలంగాణలోని ప్రముఖ ఆలయమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో ఈ వాహనానికి పూజ చేయాలని పవన్ నిర్ణయించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ వాహనంలో ఏపీలో పవన్ పర్యటిస్తారు. కాగా, సాధారణంగా కొత్త వాహనాలు కొన్నవారు కొండగట్టు అంజన్న ఆలయంలో తొలిపూజ నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa