గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. గుజరాత్ లో 182 స్థానాలకు గానూ బీజేపీ 156, కాంగ్రెస్ 17, ఆప్ 6, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో 68 స్థానాలకుగానూ కాంగ్రెస్ 35, బీజేపీ 32, ఆప్ 1 స్థానంలో ముందంజలో ఉంది. హిమాచల్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి కొనసాగుతుంది. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమైంది. హిమాచల్ ప్రదేశ్ లో క్యాంపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి.