టీడీపీకి బీసీలు దూరం అవుతున్నారని, వైయస్ఆర్ సీపీకి దగ్గర అవుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ విషయం చంద్రబాబుకు అర్ధం అయ్యిందని.. ఫ్రస్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నాలు, విధ్వంసాలకు పాల్పడే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏం చేసినా డ్రామానే.. అని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌కు నిజంగా ఇదే ఆఖరి ఎన్నిక అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనా కాలంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశాడు? అని నిలదీశారు.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్‌లో 11 మంది మంత్రివర్గ సభ్యులు బీసీలే ఉన్నారు.. కానీ, చంద్రబాబు సమయంలో అలాంటి పరిస్థితి లేదన్నారు.. తన సొంత కులానికే చంద్రబాబు ప్రయోజనం కలిగిస్తాడు అని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్‌కు బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్‌గా విజయసాయిరెడ్డి అభివర్ణించారు.