సపోటాలో గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.సపోటా నిద్రలేమికి కూడా చెక్ పెడుతుంది. సపోటా పండ్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. సపోటా పండ్లు తింటే చర్మానికి మేలు చేస్తుంది. సపోటా గింజల పేస్ట్‌లో ఆముదం కలిపి తలకు పట్టించి, మరుసటి రోజు కడుక్కోవాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య పోతుంది అంటున్నారు నిపుణులు.