గుజరాత్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై రాహుల్ గాంధీ స్పందించారు. గుజరాత్ ప్రజల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నా. పార్టీని పునర్వ్యవస్థీకరిస్తాం. మరింత కష్టపడి పని చేస్తాం. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుంది అని ట్విటర్లో పేర్కొన్నారు. 182 సీట్లు ఉన్న గుజరాత్లో బీజేపీ రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుచుకుని ఏడోసారి అధికారంలోకి వచ్చింది. 2017లో కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకుంది కానీ ఈసారి 17 సీట్లకే పరిమితమైంది.