భారత మహిళల జట్టు ప్రధాన కోచ్ రమేశ్ పవార్ ను తొలగించడానికి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో విబేధాలే కారణమని చర్చ నడుస్తోంది. దీనిపై తాజాహగా హర్మన్ ప్రీత్ స్పందించింది. 'రమేశ్ పవార్ విధానాలు మాకు నచ్చలేదనే రూమర్లు అవాస్తవం, అతడితో మాకు ఎలాంటి వివాదం లేదు. ఇప్పుడు పవార్ ను ప్రధాన కోచ్ గా తీసేసి ఎన్ సీఏ స్పిన్ కోచ్ గా నియమించారు. మేం ఎన్సీ ఏకి వెళ్లినప్పుడు తప్పకుండా అందుబాటులో ఉంటారు. బీసీసీఐ తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా మేం కట్టుబడి ఉంటాం' అని హర్మన్ ప్రీత్ స్పష్టం చేశారు.