ఒకరికి ఒకే ఓటు నిబంధనను పటిష్టంగా అమలు చేసేందుకు భారత ఎన్నికల సంఘం (సీఈసీ) చర్యలు చేపట్టింది. వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన ఉద్యోగులు, పిల్లల చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, వలసలు వెళ్లిన వారు అక్కడ కూడా వారి ఓటును నమోదు చేసుకుంటున్నారు. ఇలా ఒకరికి రెండు, మూడు చోట్ల ఓటు హక్కు ఉండడంతో మొత్తం ఓటర్ల సంఖ్యలో తేడా వస్తుంది. దీనిని నివారించేందుకు భారత ఎన్నికల సంఘం ఫొటో సిమిలార్ ఎంట్రీస్ అనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఫొటోల ఆధారంగా డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.