బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను బలపడి తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి 440 కిమీల దూరంలో ఉన్న మాండూస్ నేడు అర్ధరాత్రి తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడనున్నాయి. ఈ తుఫాను ప్రభావం 210 మండలాల్లో ఉండనున్న నేపథ్యంలో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.