జీ20 అధ్యక్ష బాధ్యతలను ఇటీవల భారత్ స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంతర్జాతీయ జీ20 సదస్సుకు విశాఖపట్నం వేదిక కానుంది. జీ20 అధ్యక్ష దేశంగా భారత్ పలు కార్యక్రమాలు చేపట్టనుంది. దేశంలోని 56 పట్టణాల్లో పలు అంశాలపై దాదాపు 200 సదస్సులను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా కేంద్రం విశాఖను ఎంపిక చేసింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 3,4, ఏప్రిల్ 24వ తేదీల్లో పలు అంశాలపై విశాఖపట్నంలో సదస్సులు జరగనున్నాయి.