వాహనాల ఇన్సూరెన్స్ రూల్స్ మారబోతున్నాయి. దీనికి సంబంధించి నూతన ప్రతిపాదనలను భారతీయ బీమా నియంత్రణ, IRDAI రూపొందించింది. దీని ప్రకారం సాధారణ బీమా సంస్థలు, ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని వసూలు చేసి, కార్లకు మూడేళ్లు, బైక్‌లకు అయిదేళ్ల పూర్తిస్థాయి బీమా పాలసీ జారీ చేయవచ్చు. ఇప్పటి వరకూ కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు అయిదేళ్ల థర్డ్ పార్టీ బీమా పాలసీలనే బీమా కంపెనీలు జారీ చేస్తున్నాయి. ఒక ఏడాది మోటారు బీమా పాలసీలకు వర్తించే నో-క్లెయిమ్ బోనస్ (ఎన్‌సీబీ) సదుపాయాన్ని, దీర్ఘకాలిక మోటారు బీమా పాలసీలకు సైతం అమలు చేస్తారు.