దేశంలోని ఐటీ ఉద్యోగులకు తీపికబురు.దేశంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని ఐటీ యూనిట్ల ఉద్యోగులకు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పూర్తి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దేశంలోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని ఐటీ యూనిట్లలో వందశాతం ఉద్యోగులు కొన్ని షరతులతో ఇంటి నుంచి పని చేయడానికి అనుమతిస్తూ కేంద్రప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఈమేరకు ఆయా ఐటీ యూనిట్ల యజమానులు సంబంధిత జోన్ల డెవలప్మెంట్ కమిషనర్‌కు వర్క్ ఫ్రం హోం గురించి తెలియజేయాలని కేంద్రం సూచించింది.