చెన్నైకి చెందిన రఘురాంకు వివాహం చేసేందుకు తల్లితండ్రులు సంబంధాలు చూస్తున్నారు. గత మేలో రఘురాం తండ్రికి ఓ వ్యక్తి కాల్ చేసి తన సోదరుడి కుమార్తె ఐశ్వర్యకు సంబంధాలు చూస్తున్నామని, రఘురాం వివరాలు పంపాలని కోరాడు. ఆయన వివరాలు పంపడంతో రఘురాంకు ఐశ్వర్య నుండి ఫోన్ వచ్చింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తన తల్లికి ఆరోగ్యం బాలేదంటూ, వైద్యం కోసం ఐశ్వర్య అంటూ రఘురాం నుండి రూ. 20.90 లక్షలు వసూలు చేసింది. తర్వాత పెళ్లి గురించి అడిగితే ఐశ్వర్య సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో దత్తాద్రి అనే వ్యక్తి ఐశ్వర్య పేరుతో ఆడగొంతుతో మాట్లాడి మోసానికి పాల్పడ్డట్లు తేలింది. దీంతో పోలీసులు దత్తాద్రిని అరెస్టు చేశారు.