ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వన్‌టౌన్‌లో భక్తుల కోలాహలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 11:36 AM

విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతం గురువారం విశాఖ పురి మేరీ మాత భక్తులతోను, కనక మహా లక్ష్మి అమ్మవారి భక్తులతో పులకరించి పోయింది. విశాఖ పురి మేరీ మాత (కొండ గుడి) పండగ కావడంతో మరొక వైపు కనక మహాలక్ష్మి అమ్మవారి 3 వ లక్ష్మీవారం మార్గశిర మాసోత్సవాలు కావడంతో హిందూ క్రైస్తవ మతాలకు చెందిన భక్తులతో టౌన్ కొత్త రోడ్డు, బురుజు పేట, పూర్ణామార్కెట్ మెయిన్ రోడ్డు, రీడింగ్ రూం, కురుపాం మార్కెట్, పాత పోస్టాఫీసు, ఫెర్రీ రోడ్డు ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. వివేకానంద స్వచ్ఛంద సంస్థ కొండగుడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రాత్రి 7 గంటల వరకు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com