జనసేన రాష్ట్ర వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని 76వ వార్డు మువ్వల మురళి మర్యాద పూర్వకంగా కలిసి ప్రభుత్వం యొక్క వైఫల్యం అలాగే గాజువాక పరిస్థితిని వివరిస్తూ అలాగే వాటిలో జరుగుతున్న అన్యాయాలు , అక్రమాలపై సమగ్ర సర్వే చేసి ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం ఖాయం అని ప్రజా సమస్యలపై పలుసార్లు పోరాడుతున్న పట్టించుకోని అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులను నిలదీసే విధంగా జనసేన కార్యకర్తలను బలోపేతం చేయమని ,అలాగే మన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ నెరవేరుస్తానని మువ్వల మురళి కి వివరించడం జరిగింది .ఈ సందర్భంగా 76 వ వార్డు జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.