ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, నేడు రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు కీలక ప్రైవేటు బిల్లులను ప్రవేశ పెట్టనుంది. బీసీ జనగణన చేపట్టేలా రాజ్యాంగ సవరణ చేయాలంటూ ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టనుంది. దీంతో పాటు సెస్, సర్ ఛార్జీల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేలా మరో బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులను పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సభ ముందుకు తీసుకురానున్నారు. అంతేకాకుండా మిరప పంట పరిశ్రమ అభివృద్ధి బిల్లును వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు.