ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, UPA ఛైర్పర్సన్ సోనియా గాంధీ పుట్టినరోజు (డిసెంబర్ 9) సందర్భంగా పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు మంచి ఆరోగ్యంతో కూడిన సుదీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని మోదీ ట్వీట్ చేశారు. కాగా సోనియా శుక్రవారం 76వ పడిలోకి అడుగుపెట్టారు. అటు రాజస్థాన్లోని షేర్ బాఘ్ హోటల్లో శుక్రవారం సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు.