ఒకే రాత్రి రెండోసారి సెక్స్ చేయడానికి నిరాకరించిందని భార్యను హతమార్చాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. మహ్మద్ అన్వర్(34)కు తొమ్మిదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అమ్రోహాలో అన్వర్ బేకరీ నిర్వహిస్తున్నాడు.
ఇన్నాళ్లు కలహాలు లేకుండా సాఫీగా సాగింది వీరి జీవితం. అయితే ఒక రోజు రాత్రి రెండోసారి శృంగారం వద్దు అన్న భార్యపై గొడవకు దిగాడు అన్వర్. వీరిద్దరి మధ్య గొడవ ఎక్కువవటంతో, క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వర్‌ను అరెస్టు చేశారు.