సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ స్థానానికి మరోసారి పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. తన భావాలు అమలు చేస్తానని భరోసా ఇచ్చిన పార్టీలో చేరడంపై ఆలోచిస్తానని తెలిపారు. లేదంటే స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. కాగా, 2019 ఎన్నికల్లో ఆయన జనసేన తరపున పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయి మూడవ స్థానంలో నిలిచారు.