బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో రోహిత్ బంగ్లాతో టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14నుంచి జరగాల్సిన టెస్టు సిరీస్ కి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు కేఎల్ రాహుల్ కు అప్పగించనున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ టెస్టు సిరీస్ లో లేనందున సారథ్య బాధ్యతలు రాహుల్ కి అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టు సిరీస్ లో భాగంగా టీమిండియా బంగ్లాతో రెండు టెస్టులు ఆడనుంది.