విమానాలు సాధారణంగా శుద్ధమైన ప్రత్యేక పెట్రోల్‌తో నడుస్తాయి. దీనిని విమాన ఇంధనమని పిలుస్తారు. ఇప్పుడు విమానయాన రంగంలో సంచలన మలుపుగా వంట నూనెతో నడిచిన విమానం ఆకాశంలోకి ఎగురుతోంది. ఈ ఘనతను బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్ సాధించింది. సైనిక రవాణా విమానాన్ని100% సుస్థిర విమాన ఇంధనం (SAF) సాయంతోనే నడిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇలా ప్రయాణించిన విమానాల్లో ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది కావడం గమనార్హం. SAF సాధారణ విమాన ఇంధనం కన్నా తక్కువ కార్బన్‌ను విడుదల చేస్తుంది. విమాన ఇంధనంతో పోలిస్తే కర్బన ఉద్గారాల చట్రాన్ని సుమారు 80 శాతం వరకు తగ్గిస్తుంది.