జగన్రెడ్డి అవినీతి పాలనతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు విమర్శించారు. మండలంలోని దండిగానపూడి గ్రామంలో గురువారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..... జగన్ ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజలను జగన్ వంచించాడన్నారు. గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫాల్యాలు గ్రామస్థులకు వివరించారు. మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, దండిగానపూడి టీడీపీ నాయకులు జగన్, నాగరాజు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఊచా గ్రేసమ్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.