ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులకు 4 రోజులు హాజరై యాజమాన్యానికి తెలియకుండా మేనేజ్ చేసిన ఘటన కేరళలో జరిగింది. మలప్పురానికి చెందిన ఇంటర్ బాలిక కోజికోడ్ మెడికల్ కాలేజీకి 4 రోజులు వెళ్లి అటెండెన్స్ వేయించుకుంది. ఆ తర్వాత కనిపించకపోవడంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఎంబీబీఎస్ సీటు వచ్చిందని సదరు బాలిక అందరికీ మెసేజ్ లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మెడిసిన్ చదవాలనే కోరికే ఆ బాలిక అలా చేయడానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై అంతర్గతంగా విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa