అమెరికాకు భారత్ మిత్రదేశంగా ఉండబోదని, ఆ దేశమే ప్రపంచంలో గొప్ప శక్తిగా అవతరిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. గడిచిన 20 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య బలోపేతమైన సంబంధాలున్నాయని.. ఇవి స్నేహానికి సంకేతమని తెలిపింది. గురువారం ఆస్పెన్ సెక్యూరిటీ సమావేశంలో వైట్ హౌస్ కోఆర్డినేటర్ కర్ట్ క్యాంప్ బెల్ పాల్గొని ప్రసంగించారు. తన దృష్టిలో 21వ శతాబ్దంలో అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక దేశమని పేర్కొన్నారు.