ఇటీవల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ముస్తఫాబాద్ వార్డు (వార్డు నెం. 243) నుంచి గెలుపొందిన సబిలా బేగం, బ్రిజ్ పురి వార్డు (వార్డు నెం. 245) నుంచి గెలుపొందిన నజియా ఖాతూన్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 7కి తగ్గింది. మరోవైపు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 250 వార్డులకు గాను 134 వార్డుల్లో ఆప్ గెలిచింది. బీజేపీ 104 వార్డులతో సరిపెట్టుకుంది.