దేశంలో నేటికీ పెట్రోల్ ధరలు భగ్గు మంటున్నాయి. దీంతో రోడ్డుపైకి వాహనం తీసేందుకు వాహనదార్లు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహనాలకు భారత్‌లో ఇటీవలి కాలంలో మంచి డిమాండ్ ఉంది. ఇది క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా పలు స్టార్టప్‌లు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వరుసగా విడుదల చేస్తున్నాయి. పెద్ద పెద్ద తయారీ కంపెనీలకే సవాల్ విసురుతున్నాయి. వీటిన తట్టుకునేందుకు పెట్రోల్, డీజిల్ వాహనాలకు చాలా కష్టంగా అనిపిస్తోంది. ఇటీవల టీవీఎస్ కూడా ఎలక్ట్రిక్ ఐక్యూబ్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. పెట్రోల్‌తో నడిచే స్కూటర్లు, బైక్స్ రూపొందించి ఇప్పటికే టీవీఎస్ కంపెనీ ఎంతో ప్రజాదరణ పొందిన విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని.. ఈ దిగ్గజ టీవీఎస్ కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి ప్రవేశించింది. తాజాగా.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఇప్పుడీ టీవీఎస్ ఎలక్ట్రిక్ ఐక్యూబ్ సేల్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీని ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అందుకే విపరీతమైన డిమాండ్ కారణంగా.. టీవీఎస్ స్కూటర్ రికార్డుల్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అంతా ఈ స్కూటర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక్కనెలలోనే ఏకంగా 10 వేలకుపైగా యూనిట్లను విక్రయించింది. ఇప్పటివరకు ఇదే రికార్డు కావడం విశేషం. గతేడాది నవంబర్‌లో మాత్రం సేల్స్ మూడంకెల్లోనే ఉండటం గమనార్హం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.