జీ-20 సదస్సు సన్నాహాకాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైయస్ జగన్‌తో పాటు సీఎస్ కె. ఎస్. జవహర్ రెడ్డి, డీజీపీ కే. వి. రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ (ఎక్సైజ్, వాణిజ్య పన్నులు) స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.