అన్నమయ్యజిల్లాలో నగర వనాల ఏర్పాటుకు అధికార యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గిరీష ఆదేశించారు. శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. రాయచోటి, మదనపల్లె, రాజంపేట ప్రాంతాల్లో నగర వనాలు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన ప్రణా ళికలపై నివేదికలు అందజేయాలన్నారు. అనంతరం చెర్లోపల్లె పరి ధిలోని నగరవన స్థలంతోపాటు ఎగువ అబ్బవరం గ్రామ సచివా లయాన్ని సందర్శించారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయా లని సిబ్బందికి సూచించారు. ఆయనవెంట ఆర్డీవో రంగస్వామి, డీఎఫ్వో నాగమునేశ్వరి, కమిషనర్ రాంబాబు తదితరులున్నారు.