ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 500 కంపెనీల్లో మన దేశానికి చెందిన 20 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. గతేడాది ఈ జాబితాలో మన కంపెనీలు 8 మాత్రమే ఉండగా, ఈ సంవత్సరం భారీగా పెరిగాయి. ఈ సారి జాబితాలో అత్యధిక కంపెనీలు ఉన్న దేశాల్లో మన దేశం ఐదవ స్థానం పొందింది. అంతర్జాతీయంగా యాపిల్ 2.4లక్షల కోట్ల డాలర్ల విలువతో అగ్రస్థానంలో నిలవగా, మైక్రోసాఫ్ట్ 1.8 లక్షల కోట్ల డాలర్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 202 బిలియన్ డాలర్ల తో ప్రథమ స్థానంలో నిలవగా, టీసీఎస్ 193 బిలియన్ డాలర్లతో రెండో స్థానం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు 97 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాయి. కాగా, అదానీకి చెందిన 4 కంపెనీలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.