ఏపీ వైద్యశాఖకు కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించింది. విలేజ్ క్లినిక్ లు, టెలీ మెడిసన్ సేవలను సమర్థవంతంగా అమలుచేస్తున్నందున ఈ కేంద్రం ఈ అవార్డులను ఇవ్వనుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే(డిసెంబర్12) సందర్భంగా నేడు, రేపు వారణాసిలో జరిగే వేడుకల్లో రాష్ట్ర మంత్రి విడదల రజినీ ఈ అవార్డులు స్వీకరించనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం 10,032 విలేజ్ క్లినిక్ లను నెలకొల్పుతోంది. 2.84 కోట్ల మందికి టెలి మెడికల్ సేవలు అందించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.