టీచర్ల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేడ్-2 హెడ్ మాస్టర్లు, టీచర్ల బదిలీల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఒకే చోట 10 ఏళ్లు పూర్తి చేసుకున్న హెడ్ మాస్టర్లకు, 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లకు బదిలీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12 నుంచి బదిలీల ప్రక్రియ ఆన్‌లైన్ లో ప్రారంభం కానుంది. జనవరి 12న బదిలీలకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేస్తారు.
మున్సిపల్ టీచర్లకు ఈసారి బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. టీచర్ల బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీల్లో డీఎస్సీ-98 అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వనున్నారు. జిల్లా విద్యాధికారుల బదిలీలు కూడా జరగనున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4 డీఈవో పోస్టులతో పాటు మరికొన్ని జిల్లాల్లో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.