ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను పొరుగు సేవల పద్ధతిలో 23 పోస్టులకు నియామకానికి దరఖాస్తు కోరుతున్నట్లు శ్రీశైల ఐటీడీఏ అధికారి రవీంద్రారెడ్డి ప్రకటన ద్వారా తెలిపారు. టీజీటీ అభ్యర్థులు తప్పనిసరిగా డీఈడీలో ఉత్తీర్ణత పొంది టెట్ అర్హత పొంది ఉండాలని తెలిపారు. డిగ్రీతో పాటు సంబందిత సబ్జెక్టు నందు ప్రావీణ్యం ఉండి 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. పీజీటీ లేదా జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలని తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు ఎంపీఈడీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అర్హతలు ఉండి ఆశక్తి గల విద్యార్థులు ఈ నెల 16 వ తేదీలోగా నంద్యాల జిల్లా, శ్రీశైలం డ్యాం ఈస్ట్, ఏ.పీ.టీ.డబ్య్లూ,ఆర్ జూనియర్ కాలెజ్, కన్వీనర్ ప్రిన్సిపాల్‌కు దరఖాస్తును స్వయంగా అందజేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకన్న అభ్యర్థులకు ఈ నెల 21, 22 తేదీలలో ఇంటర్వ్యూ ఉంటుందని, ఎంపికైన అభ్యర్థులు కర్నూలు, నంద్యాల జిల్లాలోని ఏ గిరిజన గురుకుల విద్యాసంస్థలో అయినా పని చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నియామకప్రక్రియ 2022-2023 విద్యా సంవత్సరానికి మాత్రమే పరిమితమని తెలిపారు. మరిన్ని వివరాలకు 9490957268 నెంబరును సంప్రదించాలన్నారు.