అసోంలోని గువాహటిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి నగరంలోని ఫటాసిల్ అంబారి ప్రాంతంలోని మురికివాడలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అవి పక్కనున్న గుడిసెలకు వ్యాపించి ఇండ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు, రూ.లక్షల్లో నగదు కాలిపోయింది. సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa