సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు 11, 12 గేట్లు ద్వారా పెన్నా డెల్టాకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 11,752 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 25,310 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 70 టీఎంసీలుగా కొనసాగుతోంది. సోమశిల జలాశయానికి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో పెన్నా పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.