మాండూస్ తుఫాన్ రాక నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలపై, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైన చోట పునరావాస శిబిరాలను తెరిచి, ప్రజలకు అండగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.