బరువు పెరగాలనుకునే వారు శరీరానికి కచ్చితంగా ఎక్కువ క్యాలరీలను అందించాలి. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే ప్రోటీన్ స్మూతిని తయారు చేసుకోని తాగి ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. ఒక గ్లాసు పాలల్లో రెండు అరటిపండ్లను వేసి కలపాలి. దీంతోపాటు రాత్రంతా నానబెట్టిన 10 ఎండుద్రాక్షలను కూడా వేసుకొని స్మూతీలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారీ చేసుకున్న స్మూతీని ఉదయం, సాయంత్రం తీసుకోవడం ద్వారా త్వరగా బరువు పెరగొచ్చు. దీనిని తీసుకోవడం వల్ల నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలు తగ్గి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.