హ్యాకర్లు ట్విట్టర్ అధికారిక ఖాతాలపై పంజా విసురుతున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను దుండగులు హ్యాక్ చేశారు. హ్యాక్ చేసిన అనంతరం ఆ ఖాతా ట్విట్టర్ ప్రొఫైల్ ఫోటో, కవర్ ఫోటోలను మార్చేశారు. పార్టీకి ఎటువంటి సంబంధం లేని క్రిప్టో కమ్యూనిటీ పోస్టులకు రీ ట్వీట్ చేస్తున్నారు. కాగా, దీనిపై వైసీపీ శ్రేణులు ఇంకా స్పందిచలేదు. కాగా, కొన్ని రోజుల కిందటే తెలుగుదేశం పార్టీ అధికారిక ఖాతా కూడా హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే.