ఏపీ పోలీసు శాఖ భారీగా హోంగార్డులను తొలగించింది. చిత్తూరు జిల్లా పోలీస్ శాఖలో 87మంది హోంగార్డులను తొలగిస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. 2014-2019లో వీరంతా నకిలీ నియామక ఉత్తర్వుల ద్వారా ఉద్యోగంలో చేరారు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసుశాఖ వీరిని ఉద్యోగం లోంచి తొలగించింది. కొద్ది రోజుల కిందట ఈ నకిలీ ఉత్తర్వుల వ్యవహారం వెలుగు చూడగా, చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్రత్యేంకంగా కేసు దర్యాప్తు చేయించి, ఈ తంతగమంతా బయటపడేలా చేశారు.