దేశంలో ఏ రాష్ట్రంలో మద్యం ఎక్కువగా వినియోగం జరిగిందో క్రిసిల్ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ నివేదికల ప్రకారం.. దేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో 95 శాతం మంది 18-49 ఏళ్ల మధ్య వయసున్న పురుషులున్నారు. 2020లో దేశంలో విక్రయించిన మొత్తం మద్యంలో 45 శాతం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. ఆ ఏడాది మద్యంపై రాష్ట్ర ఎక్సైజ్ సుంకం ద్వారా మొత్తం రూ.1,75,501 కోట్లు ఆర్జించినట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి.