అవయవ మార్పిడి రోగులకు ఇది నిజంగా శుభవార్తే. ఇలాంటి వారు ఎదుర్కొనే అత్యంత తీవ్ర సమస్యకు అమెరికాలోని కొలంబియా వర్శిటీ శాస్త్రవేత్తలు విరుగుడు కనుగొన్నారు. ఇందుకోసం ఓ ‘సజీవ ఔషధాన్ని’ అభివృద్ధి చేశారు. ఇందులోని సుశిక్షిత కణాలు ప్రాణాంతక ఇన్ ఫెక్షన్ల నుంచి రోగులను రక్షిస్తాయని వెల్లడైంది. భవిష్యత్ లో ఇవి క్యాన్సర్ పై పోరుకూ అక్కరకొస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు ఇన్ ఫెక్షన్ కు గురి కాకుండా ఈ ఔషధం రక్షిస్తుంది.