కోట్లాది మంది వినియోగించే జీమెయిల్ మొరాయించింది. వినియోగదారులకు జీమెయిల్ ఓపెన్ కాలేదు. మొబైల్ తో పాటూ, డెస్క్ టాప్ వర్షన్ లో జీమెయిల్ కొంతసేపు ఆగిపోయింది. ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ గురించి తెలియజేసే డౌన్ డిటెక్టర్ డాట్ కామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. చాలామంది వినియోగదారులు తమ జీమెయిల్ సర్వీసులను ఉపయోగించలేకపోయారని తెలిపింది. జీమెయిల్ పనిచేయకపోవడంతో చాలామంది యూజర్లు ట్వీట్లు చేశారు. జీమెయిల్ డౌన్ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు చేశారు.